Thursday, March 10, 2011

సిగ్గు పడాల...సంబరం చేయాలా...?


సిగ్గు పడాల...సంబరం చేయాలా...?

                వందల ఏళ్ళుగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవాన్ని ఒక్క సారిగా నెల కూల్చుకున్న చర్యని ఏమని వర్ణించాలి. ఎలా జీర్ణించుకోవాలి. మనకు ఎం కావాలి... ఎలా సాధించుకోవాలి. మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బ్యాండ్లో విగ్రహాలను ద్వంసం చేసిన ఘటన కేవలం మన రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారత దేశంలో జరిగిన అనేక దుర్మార్గపు చర్యల్లో ఒకటిగా నిలిచిపోతుంది. ఆటవిక చేష్టలకు పరాకాష్ట. ఎటుపోతున్నాం. ఏమైపోతున్నాం. ఇదేనా మనం నేర్చుకున్న విజ్ఞానం. సంపాదించిన సాంస్కృతిక వైభవం.     

 మన అమ్మ పాలు తాగి రొమ్మునే కోసేసిన చందం. అన్నం తినే ఎ ఒక్కడు చేయలేని పాశవిక చర్య. ఎవరు ఎలా స్పందించినా, ఏవిధంగా కన్డిన్చినా, జరిగిన ఘోరాన్ని కప్పి పుచ్చలేరు. కేవలం బొమ్మల్ని కుల్చినందుకే అంత రోషం వచ్హిందా అని ప్రశ్నిస్తున్న చవక బారు నేతలు, మీడియా పెద్దల పై జాలేస్తుంది. కేవలం ఆ విగ్రహాలను బొమ్మలుగానే చూస్తున్న వాళ్ళ విజ్ఞత నిస్చేస్తుడ్ని చేస్తోంది.  
                        అన్నమయ్య,కృష్ణ దేవరాయులు, క్షేత్రయ్య, నన్నయ, ఇలా ఒకరేంటి ఎందరో మహానుభావులు మన తెలుగు భాషను, తెలుగు జాతి గౌరవాన్ని, గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసారు. వీళ్లా మన కుటిల కాంక్షలకు, చవక బారు రాజకీయ నీచ ప్రయోజనాలకు, బలికావాల్సింది. ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్ని చూస్తూ, వాటిలో జీవిస్తున్నాం. ఓ సారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మనసున్న...మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు సిగ్గు పడక తప్పదు. మనిషిగా పుట్టిన ప్రతివాడు స్పందించాల్సిన దురదృష్ట సంఘటన.   
                          ఇవన్ని ఉద్యమంలో భాగమే అనే వాడు ఒకడు. మా జీవిత్లతో పోలిస్తే ఇదేన్తా అనేవాడు ఒకడు. ఆ బొమ్మల్లో మావాడు ఒక్కడు కూడా లేడురా, అంటాడు వేరొకడు. ఇలా ఆలోచించే వాళ్ళుపై జాలేస్తుంది. 
    కేవలం ఒక్క బాబ్రీ మసీదు కూలిచిన రోజుని ఇప్పటికీ, బ్లాక్ డే గా పాటిస్తున్న గొప్పతనం మన జాతిది. కుల మతాలకు అతీతంగా, భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న అరుదైన సమాజం మనది. ఇది ఎ ఒక్కరి వల్లో, ఒక్క ప్రాంతం వారి ప్రతిభాతోనో సాధించుకుంది కాదు. సమిష్టిగా సంపాదించుకున్న సాంస్కృతిక వైభవం. 
        ఇంకా ఇలాంటి పైశాచిక చర్యలు కట్టి పెట్టాలి. నిన్నటి ఘటన ఒక ప్రాంతం వాళ్ళ వైకరికి నిదర్సనం అనుకుని సర్ది చెప్పుకుందామా... ఇన్నేళ్ళు గడుస్తున్నా ఇంకా వాళ్ళు ఆటవికంగానే బతుకుతున్నారని అనుకుందామా.... ఏదేమైనా...
       ఆహా ఓ భారతావని ఎలాంటి భావిభారత పౌరిల్ని కన్నవ మ్మా, నీ భవిష్యతు ఊహించుకుంటే భయం వేస్తోంది. 

8 comments:

  1. బాగా రాసావు తమ్ముడు...దీనిమీద కూడాచాలా నెగెటివ్ కామెంట్లు వస్తాయి. కానీ వాస్తవం మాత్రం ఇదే. నిస్సిగ్గుగా దీన్ని సమర్థించేవాళ్లను ఏమీ అనలేం. అనడానికి మాటలు రావు లేవు కూడా. ఉద్యమాన్ని గౌరవించాలి. కానీ ఉద్యమ స్పూర్తికి వ్యతిరేకంగా సాంస్కృతిక హింస సరైనది కాదు. ఎంత సమర్థించుకున్నా తప్పు ఒప్పైపోదు. జరిగిన దాన్ని చూసి సిగ్గుపడాలి. ఇంత నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నవాళ్లను చూసి జాలిపడాలి.

    ReplyDelete
  2. ఇది మీ కంటికి కనిపించిన సిగ్గు పడే దానవత్వం – కచ్ఛితంగా తప్పే ఒప్పుకుంటా…!

    మరి ఇక్కడి ప్రజలకు చేసిన వాగ్దానలను తుంగలో తొక్కిపడేస్తూ మొన్నీమధ్య ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేస్తామని ఇచ్చిన మాటలను గంగలో కలిపేసి మరి కనపడకుండా చేసిన దానవత్వం – దానిపై మీ అభిప్రాయం కూడా రాస్తే చదవాలని ఉంది.

    అయితే ఈ కనిపించిన దానవత్వం మరింత పెద్దదిగా మారకూడదని – ఇక్కడ స్థిరపడిన వలసాంధ్రులు క్షేమంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ… సెలవు.

    ReplyDelete
  3. వీరికి ఎప్పుడూ బుద్ధి వస్తుందో ఆ భగవంతుడికే తెలియాలి.

    ReplyDelete
  4. నిన్న ట్యాంక్ బ్యాండ్ పై జరిగిన దాంట్లో నూటికి నూరు శాతం ప్రభుత్వ, పోలీసు వైఫల్యం వుంది. శాంతియుతంగా జరుపుతామన్నా మిలియన్ మార్చ్ కి అనుమతి ఇవ్వకపోవడం ఓ తప్పు. ప్రజలు, ఉద్యమ కారులు దిశానిర్దేసం లేనికారణంగా హింసకు పాల్పడినప్పుడు అదుపు చేయకుండా పోలీసులు సోద్యం చూడటం మరో తప్పు. నిజానికి సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటూ నాయకులు తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. వారి వైఖరితో ప్రజలు విసిగిపోయారు. పులిమీద స్వారీ ఎంతమాత్రం సరికాదని నిన్నటి సంఘటన నిరూపించింది. ఒకటి మాత్రం నిజం... ఉద్యమం ముసుగు వేసుకున్న కిరాయి మూకలకు మొల్ల అయినా ఒకటే... గుర్రం జాష్వా అయినా ఒకటే! పైగా ఓ ఉద్యమ నాయకుడు విగ్రహాలలో ప్రాణం వుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ఇవాళ తెలిసిందా! భేష్... మరి ఆంధ్ర దేశంలోని పల్లెల్లోని విప్లవకారుల స్తూపాలెందుకు... కూల్చేయండి.

    ReplyDelete
  5. ఇది చరిత్రహీనులు చేసిన దుర్మార్గపు చర్య...

    ReplyDelete
  6. idi mummatiki chala pedda tappu.....it is a question of humanity , sinciarity....but not a answer of telangana and andhra.....ee udyamaniki naa laal salam....we all r in a democratic country ....gandhi desam....no violence only ahimsa.......follow gandhigiri.

    ReplyDelete
  7. ఉద్యమం ఛాలా గొప్పది దాన్ని విలువను పోగొట్టేట్టు ఇలాంటి ఆలోచనా రాహిత్యపు పనులు చేస్తాయి . ఉద్యమాన్ని నడిపే నేతలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి. ఆ సంగటన గుర్తుకు వస్తే బాధ కలుగుతుంది. మనం ఇంకా ఆటవిక దశలో ఉన్నామా అనిపిస్తుంది. ఇప్పుడే కాదు తెలంగాణా యువకులు ప్రాణ త్యాగాలు చేసినపుడు కూడా ..నాయకుల్లరా మీరెందుకు ప్రాణ త్యాగాలు చెయ్యడం లేదు..ఎంతో భవిషత్తు ఉన్న బిడ్డలను రెచగొట్టి వారి భావిశతును ఎందుకు ఎలా చేస్తున్నారు అనీ నినదిచాలని ఉంది...తమ్ముడు బాగా రాశావు..నీ భావా వేశం బాగుంది....కాని ఇక్కడ జరుగుతున్న ప్రాణ త్యాగాల గురిఇంచి కుడా ప్రస్తా వించి ఉంటె బాగుండేది..

    --

    ReplyDelete
  8. తమ్ముడూ...నీ ఆవేశానికి అక్షర రూపం ఇచ్చావు. పీడకలను పదేపదే తలుచుకోము. డాక్యుమెంటరీ అంతకన్నా చేసుకోం. అందమైన లోకం అని బ్లాగు పేరు పెట్టావు...ఈ నిత్యకృత్యాలు టీవీలలో, పేపర్లలో ఎలాగు చూడక తప్పడం లేదు. నీ బ్లాగులోనైనా అందమైన కబుర్లు,ఆహ్లాదకర విషయాలు చెప్పొచ్చు కదా. పరమహంస

    ReplyDelete