Thursday, January 6, 2011

సినిమా వాళ్ళ రంగుల కల...!

            సినిమా అంటేనే రంగుల ప్రపంచం. చాలా మంది సినిమాలలో సెటిల్ అవుదామని, హీరోనో, హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుధామని అందమైన కలలెన్నో కంటారు. అందుకోసం పగలనక రేయనక తెగ ప్రయాస పడతారు. అది సహజం. ఇప్పుడు సీన్ మారింది. ఇండస్ట్ర్రీ లో  ఫుల్ గా సెటిల్ అయ్యి ఓ వెలుగు వెలుగుతున్న వాళ్ళందరూ గత నెలరోజులుగా అందమైన కలలెన్నో కంటున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇందుకోసం మీటింగ్ ల మీద మీటింగులతో బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఒకప్పుడు అప్పటి అగ్ర హీరోలు ఎన్టిఆర్, ఏఎన్నార్, శోభన్బాబు వంటి నటులు ఆన్ స్క్రీన్ మీదే కాదు నిజ జీవితంలోను క్రమశిక్షణతో హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకున్నా, ఇప్పటి సదుపాయాల్లో సగం కూడా లేని రోజుల్లో అధ్బుతాలు సృష్టించారు. వ్యక్తి గతంగా ఎలా వున్నా, పనిలో మాత్రం పక్కా  ప్రోఫెషనలిజం చూపించారు. పొద్దున్నే ఏడు గంటలకు షూటింగ్ అంటే పది నిముషాల ముందే స్పాట్లో వుండేవారట. ఇప్పుడు మన హీరోలకు వసతులు , హీరోయిన్ లతో సొల్లు ఫై వుండే శ్రద పని మీద వుండడం లేదు. లేటుగా సెట్స్ కి రావడం, త్వరగా వెళ్ళిపోవడం, కబుర్లతో నిర్మాతలకు చుక్కలు చూపించడంలో ఎవరు ముందుంటారో వాల్లే బిగ్ స్టార్స్. ఇది ఇప్పటి హీరోల పరిస్థితి. ఇక హీరోయిన్ లు, అబ్బో అబ్బో వీళ్ళ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, తెలుగు రాదూ, నటన అంటేనే తెలీదు, ఇక హావ భావాల వుసేన్దుకులెండి . జస్ట్ వీళ్ళంతా వొంపు సొంపులతో సొమ్ము చేసుకోవాలని చూసే కలల కిలాడీలు.  చిన్న దుస్తుల్లో  తెల్ల తోలు తో తమాషా చేసే నెరజానాలు. ఒకప్పటి నిర్మాతలు వాళ్ళు  తియ్యలనుకునే సినిమా కథ ఎక్కడ తియ్యాలి, ఎలా తియ్యాలి ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చెయ్యాలి అనే కీలక అంశాలపై స్పష్టత వుండేది. ఇప్పటి నిర్మాతలు అయ్యో పాపం వీటిపై కనీసం అవగాహనా కాదు ఆసక్తి చూపించడం లేదు. అందుకే సినిమాల పరిస్థితి ఇంత దారుణంగా వుంది.
                                                                ఇలాంటి పరిస్తితుల్లో సినిమా పరిశ్రమలో సమూల మార్పులకు పూనుకుంటున్నారు. నిర్మాతలే బాస్ అవ్వాలి, హీరోలు సెట్స్ కి టైం కి రావాలి, తెలుగు హీరోఇన్స్ పెరగాలి, కర్చులు తగ్గాలి, విజయవంతమైన సినిమాల సంఖ్యా పెంచాలి ఇలా ఎన్నో ఎన్నో అన్ని ఒకేసారి మారాలి అనే అధ్బుతమైన కలలు ఎన్నింటినో ఒకే సరి కంటున్నారు. ఈ కలలన్ని నెరవేరుతాయో, లేక కల్లలు గానే మిగుల్తాయో తెలీదు కానీ. తప్పులు తెలుసుకున్నారు అదే పది వేలు అంటున్నారు సీనియర్ నటులు. ఎవరి గోల వాళ్ళది.

                                            ఏదేమైనా, పరిశ్రమ ఏదైనా, శ్రమించే గుణాన్ని నమ్ముకుని భాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తేనే హక్కుల కోసం పోరాడే పరిస్తితి ఉంటుందని ఎప్పటికి తెలుస్తుందో ఈ సినిమా మానవులకి.  సినిమాని అభిమానించే వ్యక్తిగా, సినిమా పరిశ్రమను దగ్గరగా చూసే అవకాశం కలగినందుకు, సినిమా వాళ్ళ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కాని కలలు నెరవేరాలంటే కళలో కళాత్మకత వుండాలికదా....!