Saturday, January 8, 2011

ఎలా వుంది మన బడి...!

తల్లి,  తండ్రి, గురువు దైవం ఇదే మనం నేర్చుకున్న మొదటి పాటం. ఈ ఒక్క మాట చాలు మన జీవితంలో విద్యకు, విద్య నేర్చుకున్న బడికి వున్న గొప్పతనం ఏంటో. చిన్నప్పుడు మనం చదువుకున్న బడి ఎంత గొప్పదో కదా...! ఇంగ్లీష్ మీడియం పూర్తిగా రాని రోజుల్లో అంటే సుమారు పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చదువులు అందించిన బడుల్ని, అప్పటి విద్యార్ధుల్ని తలచుకుంటే మనసు ఆనంద పారవశ్యంలో తేలిఆడుతుంది. విధ్యార్ధులతో కిక్కిరిసిన తరగతి గదులు, గచ్చులు లేని నేల, పూర్తిగా రాయని బ్లాకు బోర్డు అయిన చెప్పే గురువులలో, వినే విద్యార్ధుల్లో  ఏదో పవిత్రత. క్రమశిక్షణతో కూడిన విద్య. అమ్మ చెప్పిన బుద్ధులు, బడికి పంపే ముందు ఇచే తాయిలం, చిన్న నిక్కరు, బుజ్జి చొక్కా, సంకలో టైలర్ కుట్టిచ్చిన సంచి, ఉచిత పాఠ్య పుస్తకాలు, బడికి చేరగానే మొదలయ్యే వందన సమర్పణ, ఒక్కొక్కటిగా మొదలయ్యే పాఠాలు, గంటన్నర కాగానే ఇచ్చే, ఇంటర్వెల్, తోట పని, అలిసేవరకు మనసార అడే ఆటలు, ఆహా ఎంత క్రమశిక్షణ కలిగిన విద్య. నిజంగా ఇంతటి అందమైన భాల్యాన్ని గడిపామా అనే ఆనందం కలుగుతుంది. మరో పక్క గర్వంగాను వుంది. పల్లె ఒల్లో ఓ మూల పాతబడిన భవనం లో వుండేది మన బడి. అక్కడి నుంచే అందరి బంగారు భవితకు పునాదులు పడ్డాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ వసతులున్న పిల్లలకి దీటుగా పోటీ పడే శక్తిని, ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చింది ఆ చిన్న బడే. కొన్ని సార్లు వాళ్ళ కంటే మనమే గొప్ప అనే అనుభూతిని కలిగించిన్దీ ఆ బడే. అంత గొప్పది మనం చదువుకున్న, మనకు విద్యా బుదుల్ని నేర్పించిన మన అందరి అందాల ఒడి మన బడి.కానీ ఇంత చక్కని బడి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. మనం అనుభవించిన ఆనందం, పొందిన అధ్బుతమైన, ఆత్మీయ క్షణాలు మన ముందు  తరాలకు దూరమయ్యే సమయం ఎంతో దూరంలో లేకపోలేదు. కారణాలు ఎవైన కావొచ్చు. బిజీ లైఫే ను  కాస్త పక్కకు నెట్టి ఓ క్షణం ఆలోచిస్తే గుండెల్ని పిండేసే ఆ  నగ్న సత్యం కనిపిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మనం మారాలి. మార్పు సహజం. పోటీ ప్రపంచంలో మనల్ని మనం విజేతలుగా నిలబెట్టుకోవాలంటే కొత్తధనాన్ని, సరి కొత్త నైపుణ్యాలను అందిపుచుకోవాలి. కాని, మనల్ని మానవతా మూర్తులుగా, ఓ మంచి పౌరులుగా తీర్చి దిద్ది, మన ఎదుగుదలకు బాటలు వేసిన మన బడిని మనం మరచిపోకూడదు.
                      విదేశీ అలవాట్లంటే చెవు కోసుకునే మనం, రోజుకో పాచ్యాత సంస్క్రుతిని అద్దెకి  తెచ్చుకుని సంబరపడే మనం, వాళ్ళ మంచి అలవాట్లను మాత్రం తీసుకోవడం లేదు. కనీసం వాటి పై ద్రుష్టి పెట్టలేకపోతున్నాం. ఎక్కడో చదివాను, బాగా అభివ్రుది చెందిన దేశాల్లో, జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏదో ఓ సమయంలో ప్రతి ఒక్కరు, వాళ్ళు చిన్నప్పుడు చదివిన స్చూల్స్ ని సందర్సిస్తారట. పుట్టిన రోజో, పెళ్లి రోజో, లేక పోతే పిల్లల పుట్టిన రోజునో వాళ్ళ చిన్ననాటి బడిలో గడుపుతారట. అక్కడున్న చిన్నారులకు చాకలేట్స్, తరగతి గదికి కావాల్సిన వాల్ పోస్టర్స్, వారి వారి స్తోమతకు తగ్గట్టుగా గ్రంధాలయానికి పుస్తకాలను అందిస్తారట. ఇలా ఆ ఆర్టికల్ చదువుతుంటే ఎంతో ఆనందం కలిగింది. మనసు పులకించింది. కాని మంచిని మరచి పోవడం మానవ నైజం. రాసే నేను, చదివే మీరు, మంచిని గురించి మీటింగ్ లు ఇచ్చెవాళ్ళు అంతా మంచికి దూరంగా వుంటారు. అది సహజం.


              ఎవరి కోసమో, ఎవరో గుర్తిస్తారని కాదు, మన కోసం, నిత్యం బిజీ లైఫ్ లో  ఏదో కోల్పోతున్నాం అనుకుంటూ బాధ పడే మనం ఓ సారి మన బడిని సందర్సిధం. వీలైతే ఈ తరాన్ని మన అందాల ఒడి, మన బడికి తీసుకెళ్దాం. గర్వంగా మన ఎదుగుదల పునాదుల్ని చుపిద్దం. ప్రత్యేకంగా వెళ్ళే అవకాసం లేకపోతే కనీసం కళ్ళు మూసుకుని మన బడిని, బడిలో చేసిన అల్లరిని, బడినుంచి మా బంగారు తండ్రి ఏదో సాధించి వస్తాడు అనేలా ఎదురుచూస్తున్న అమ్మ ఆనందాన్ని ఓ సారి జ్ఞాపకం చేసుకుందాం.  బాల్య స్మృతుల్ని ఆస్వాదిదాం. అందమైన అప్పటి అనుభూతుల జ్ఞాపకాల దొంతరల్లో తడిసి ముధవుదాం.

ఎలా వుంది మన బడి....!