Tuesday, February 15, 2011

వీడు మోనార్కే....!

    నేను మోనార్క్ ని అంటూ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు ప్రకాష్ రాజ్.విలక్షణ నటనతో అందరి దృష్టిని ఆకర్షించడంలో స్పెషలిస్ట్ ప్రకాష్ రాజ్. సినిమా రేంజ్ ని పెంచే నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. కొన్ని సందర్బాలలో తన కాల్ షీట్లు కోసం షూటింగ్ లను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు వున్నాయి. అదీ ప్రకాష్ రాజ్ స్టామిన. ఓ ప్రేక్షకుడిగా కాకుండా...రిపోర్టర్ గా తన గురించి తెలుసుకున్నప్పుడు...ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం తెలిసింది. కాదు... ఆయనే చెప్పాడు.... అది కూడా తనదైన స్టైల్లో.... ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సక్సెస్ ను తన చుట్టూ తిప్పుకుంటా అంటున్నాడు. లో ప్రొఫైల్ తన సక్సెస్ మంత్ర అని తేల్చి చెప్పాడు. పనిని ఇష్ట్ట పడడమే తనకి తెలుసంట్టున్నాడు.
     మీడియాలో  అనవసరంగా కనిపించడం.. నా సినిమా చూడండి అని చెప్పడం... నా ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పడం.... ఎవరికీ తలోంచడం నా లైఫ్ లో చెయ్యను అని తెగేసి చెపుతున్నాడు. అంతే కాదు సక్సెస్ గురించి....సక్సెస్ కోసమే మాట్లాడే ఇండస్ట్రీ. అందుకే సక్సెస్ వస్తే అందరు తన వెంటే వస్తారట... అదే తాను నమ్మిన ఫిలాసఫీ అని చెప్పాడు. ఎవరేమనుకుంటే నా కేంటి... నేనిలానే ఉంటా... నా తీరింతే.... నా రూటే సెపరేటు... అని బాహాటంగానే చెప్పాడు.  చీటికి మాటికి ఎవడి పుట్టిన రోజుకో నేనెందుకు మీడియా ముందు శుభాకాంక్షలు చెప్పాలి. పండక్కి, పబ్బనికి అందరిలా నేను విషెస్ చెప్పను. ఏం చెప్పక పోతే ఆఫర్లు రావా.... పోతే పోనీ... కానీ నేనింతే...అడిగిన ప్రతి ఒక్కడికి జవాబు చెప్పుకుంటూ పోతే...నా రేంజ్ ఏం గాను...నా రేంజ్కి తగ్గే పనుల్ని నేను చెయ్యను. అని తన మనసులో మాటలు ఎన్నింటినో చక చక చెప్పాడు. నేనిలానే వుంటా... కావాలనే వల్లే వస్తారు... లేక పోతే మానేయ్యండి... నేను మోనార్క్ ని. అనే రేంజ్ లో లెక్చర్ ఇచ్చాడు. ఆన్ స్క్రీన్ పై చాలా మంది చాలా డైలాగులు చెబుతారు... కానీ నేను నిజ జీవితంలో కూడా అలానే చెప్పగలనని నిరూపిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఏదేమైనా కొంత వరకు తను కూడా కరక్టే అనిపించింది.