Monday, January 10, 2011

మిలీనియం బెస్ట్ ఎంటర్ టైనర్ బాలయ్యేనట....!

        నందమూరి బాలకృష్ణ. ఈ పేరు చెబితేనే తెలుగు ఇండస్ట్రీలో ఓ విలక్షణత. దానితో పాటు ట్రెండ్ సెట్టర్ చిత్రాలు గుర్తుకువస్తాయి. ఎవరికీ లేనన్ని, ఎవరూ ఊహించలేని వైవిధ్యమైన పాత్రల్ని చేసిన ఘనత బాలకృష్ణకే సొంతం. ఎన్.టి.ఆర్. నట వారసుడిగా తెలుగు తెరకి పరిచయమైన నందమూరి రెండో తరం అందగాడు బాలయ్య. సాంఘికం, పౌరాణికం, జానపథం, ఇలా ఎలాంటి పాత్రల్నైనా తనదైన శైలిలో పోషిస్తూ అభిమానుల్ని అలరించడం బాలకృష్ణకే సాధ్యం. తెలుగు తెరపై రికార్డులను తిరగ రాయడంలో బాలయ్యకి మించిన వాళ్ళు లేరు. అది హిట్ అయినా , ఫట్ అయినా సరే. విజయం సాధించిందా బాక్స్ ఆఫీసు రికార్డుల్ని బద్దలు గొడుతుంది. ఫట్ అయ్యిందా ఇక చెప్పేదేముంది. నిర్మాత అవుట్.. అయితే ఇప్పుడు బాలయ్య ఓ కొత్త అవతారం ఎత్త్హాడు. అదే సూపర్ సెన్సేషనల్  కమెడియన్గా  మారాడు. కాదు, ఆయన్ని మోస్ట్ ఎంటర్ టైనింగ్ పెర్సోనాలిటిగా మాన వాళ్ళు  మార్చేసారు. ప్రపంచ చరిత్రలో మోస్ట్ ఎంటర్ టైనర్ చార్లీ చాప్లిన్, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళని తెగ నవ్విన్చేస్తున్న మిస్టర్ బీన్ ని, అంతెందుకు మన ఖాన్ దాదా అదేనండి సాఫ్ట్ వేర్ర్ బ్రమ్మి, బ్రమ్హానందాన్ని కూడా బాలయ్య బీట్ చేసేసాడు.
                                                
                                                       నవ్వడం ఓ యోగం, నవ్వించడం  ఓ భోగం, నవ్వక పోవడం ఓ రోగం అన్న మాటల్ని అందరం వినే వుంటాం. ఎవరేమో గాని టాలీవుడ్ టాప్ హీరో మన బాలయ్య మాత్రం పక్కాగా వంట పట్టించుకునేలా మన వాళ్ళు చేసేసారు. ప్రతేక్షంగానో, పరోక్షన్గానో , నవ్వించడం ఓ వరం. ఇప్పుడు ఆ అవకాశాన్ని ఇండియాలో బాలకృష్ణకే దక్కేలా చేస్తున్నారు మన క్రిఎటర్స్. కొత్త సూర్యోదయాన్ని బాలయ్య కామెడీ మెసేజ్ తో ప్రారంభం అవ్వడం పరిపాటిగా మారింది. ఇలాంటి అవకాశం  ఎవరికి  దక్కుతుంది చెప్పండి. ఎన్నెన్ని కొత్త కాన్సెప్ట్ లో, మరిన్ని వైవిధ్యమైన కడుపుబ్బ నవ్వించే సెటైరికల్  పద విన్యాసాలకు సెంటర్ అఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు, కాదు మెయిన్ సోర్సుగా మార్చేస్తున్నారు. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్న శ్రీ శ్రీ మాటల్ని, బాలయ్య పై వేసే కామెడీ మెసేజ్ లతో నిజం చేసేస్తున్నారు.
                                              
                                                       నలుగురు కలసి ఓ మెసేజ్ ను కడుపుబ్బా నవ్వుతు చదివారంటే, ఓ అమ్మాయి ముసి ముసి నవ్వులతో పక్క అమ్మాయికి తన సెల్ ఫోన్  చూపించిందంటే, హాయిగా దమ్ము బాబులు కాస్త రిలాక్స్ గా  దమ్మేస్తూ నవ్వుకుంటూ మెసేజ్ చదువుతున్నారంటే అవి కచ్చితంగా బాలయ్య  మెసేజ్ లే అని యిట్టె  చెప్పెయ్యోచ్చు. అధీ మన బాలయ్య స్టామినా. పాపం ఇంత మందిని ఇన్ని విధాలుగా నవ్విస్తున్నానని బాలయ్యకి తెలుసో తెలీదో! ఏదేమైనా నా పై ఇన్ని మెసేజ్ లు వస్తున్నాయని, క్రియేట్ చేస్తున్నారని బాలయ్యకి తెలిస్తే, మరో సెన్సేషనల్ సెటైరికల్ మెసేజ్ క్రియేట్ చేసే అవకాశాన్ని ఇస్తా డంటున్నారు మన వాళ్ళు. ఎనీ వే ఈ మిలీనియంలో బాలయ్యే మోస్ట్ ఎంటర్ టైనర్ గా  తేల్చేస్తున్నారు.