Tuesday, January 4, 2011

పల్లెకు పోదాం హాయిగా....!

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు,
సరదాల  సంక్రాంతి సంబరంగా సందడి చేస్తూ వచ్చేస్తోంది. పల్లెల్లో పండగ సందడి ఆరంబం అయ్యింది. కొత్త బట్టల కోసం పిల్లలు చేసే అల్లరి, కొత్త అల్లుళ్ళ కోసం అతరింట్లో  రెడీ అవుతోన్న రాచ మర్యాదలు హంగామా అంత ఇంత కాదు. అమ్మమ్మ, తాతయ్య, నాయినమ్మ, అత్తలు , మామలు,  గతంలో మనం చేసిన పండగ  సరదాలు మన కాళ్ళ ముందుకు అలా అలా ఓ అందమైన అలలా కదలాడుతున్నాయి.  పల్లెల్లో మన వాళ్ళు మనకోసం ఆశగా చూసే ఆత్మీయ చూపులు మన గుండెలకు తాకుతున్నాయి.   తెలుగు లోగిళ్ళలో పరికిణి కట్టిన పడుచులు వేసే  అందమైన రంగవల్లులు, హరిదాసు  హంగామా, కోడి పందేల కోసం చాటు మాటుగా సాగుతోన్న ఏర్పాట్లు, పేకాట రాయుళ్ళ ప్రిపరేషన్ ఇలా ఒకటా రెండా ఎన్నో మరెన్నో అంబరాన్నంటే సంక్రాంతి సంబరాల హంగామా అందరికి ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతున్నాయి. బిజీ బిజీగా  వుండే అందరికి ఆత్మీయ ఆనందాల రుచుల్ని మరో సరి రుచి చూపించేందుకు పల్లె పిలుస్తోంది. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో, బస్సు టికెట్ వుందో లేదో, ట్రైన్కి ఎలా వెళ్తాం అని మనసులో ఆరాటం పెరుగుతోంది కదా... తప్పదు ఎందుకంటే ఏడాది పటు హాయిగా పనిచెయ్యాలంటే ఆత్మీయతతో మన వాళ్ళు నింపే ఆక్షిజెన్ ను మనసారా నింపుకు రావాల్సిందే. ఇంకేదు ఆలస్యం పల్లెకు  పోదాం హాయిగా... పండగ చేద్దాం మనసార... అందరికి మరో సరి సంక్రాంతి శుభాకాంక్షలు...

Swagatham

స్వాగతం నా ప్రియ మిత్రులందరికీ నా అందమైన లోకానికి  సుస్వాగతం.