Friday, January 7, 2011

పాపం హీరోయిన్లు...!

                           తెలుగు తెరపై తమ అందచందాలతో యువకుల గుండెల్లో గుభులు రేపుతూ,  నిర్మాతలకు కాసులు కురిపించడంలో కీలక పాత్ర పోషించే వాళ్ళే కధనాయికలు. అప్సరసలకు ఇంచుమించు అటు ఇటుగా వుంటారేమో అనేలా వుండే సొగసుతో సినిమా అభిమానులతో పాటు కాస్త కళా పోషణ వున్నవాళ్ళకు నిద్రల్లేని రాత్రులని చూపించడంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు. అందుకే తరాలు మారిన వెండి తెరపై వీళ్ళు చేసే, చూపించే అభినయాలకు, అంగాంగ ప్రదర్శనకు అభిమానులు  జేజేలు పలుకుతుంటారు. గతం ఎప్పుడూ గొప్పదే అన్న నానుడికి తగ్గట్టుగా పాత సినిమా హీరోఇన్స్ చక్కటి నటనతో, మంచి కట్టూ, బొట్టు తో అందరి అభిమానుల గుండెల్లో ఆరాధ్య వ్యక్తులుగా నిలిచిపోయారు. కాని ఇప్పుడు సీన్ మారింది తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు లేరు కాదు రావడానికి ఇష్ట పడడం లేదు. ఒక వేల వచ్చినా  మన చవకబారు పాత్రల్లో ఇమడలేక, రక రకాల కారణాలతో తెలుగు తెరపై తెలుగు వచ్చిన, తెలుగు తెలిసిన అమ్మాయిల జాడ లేకుండా పోయింది.


                       అప్పుడే మొదలయింది అసలు కథ, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపల వేట.  ముంబై, గోవా, విదేశీ వనితలు ఒకటేమిటి రకరకాల రింగా రింగా భామలు తెలుగు తెరపై తెగ ఆడేస్తున్నారు, పాడేస్తున్నారు. వీళ్ళకి గిరాకి కూడా విపరీతంగా పెరిగడంతో ఒక్కసారిగా ఎర్ర తోలు భామలంతా  కొండెక్కి కూర్చుంటున్నారు. ఇందుస్త్రీకి వచ్చిన కొన్నాళ్ళకే పిలిచే పిలుపులలో, అందుకునే వసతుల్లో అమ్మగారిగా మారిపోతున్నారు. వాళ్ళ ఊళ్లలో ఆటోల్లో తిరిగే వాళ్ళంతా ఇక్కడ స్కోడా కార్స్,  ఫైవ్ స్టార్ వసతుల్ని డిమాండ్ చేస్తున్నారు, అలానే సకల సుఖాలు పొందుతున్నారు. అనుభ విస్తున్నారు. వాళ్ళ నటన దేవుడెరుగు నిర్మాతలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. పేరు, డబ్బులు వాళ్లకి కర్చులు, అప్పులు మాకా  అనే భావన ఇప్పుడు ప్రస్తుత నిర్మాతల్లో పెరిగింది. ఇప్పుడు హీరోయిన్ల కు ఇచ్చె వసతుల్ని కట్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.


                      రాజ భోగాలు అనుభవిస్తోన్న రంగుల రాణులకు  ఇకపై వసతుల్లో కట్ పడనుంది. మేక్ అప్ మెన్, అసిస్టెంట్ ఇలా అన్నింటి కర్చు హీరోయిన్ లే పెట్టుకోవలన్నమాట. సో, ఇప్పటి వరకు జిల్ జిల్ జిగాగా గడిపిన ముదుగుమ్మలకు గడ్డు రోజులు దగ్గర పద్దయన్నమాటే....! పాపం ఎంత కష్టం వచ్చిందో ఈ అభినవ సుందరాంగిలకి.