Thursday, January 20, 2011

వాయిదా బతుకులు....!



వాయిదా ఈ పదం పలికినా, విన్నా, అందరికీ ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేం.పిల్లాడికి హొం వర్క్ తర్వాత చేద్దువులే అంటే ఆనందం. విద్యార్థులకు పరీక్షలు వాయిదా పడితే ఆనందం. లాయర్లకు లాభాసాటి కేసుల్ని వాయిదాల మీద వాయిదా వేయడం అంటే ఆనందం. ఇలా చెప్పుకుంటే వాయిదాకి చాలా పెద్ద లిస్తే వస్తుంది. ఎందుకంటే వాయిదా వేయడంలోనే ఆనందాన్ని వెతుక్కునే ట్రెండ్ ఊపందుకుంది. కాదు, ఆ ట్రెండ్ను సృస్ట్టిన్చుకున్నాం. అసలు వాయిదా వేయకుండా చాలా మందికి పొద్ద్దు పొడవడమే లేదు. రొజూ ఏదో ఓ టైములో అద్దం ముందు చేత్తో  ఫ్యామిలీ ప్యాక్ ను మించిపోతున్న పొట్టను నిమురుతూ .... రేపటి నుంచి జాకింగ్, వాకింగ్, మొదలు పెట్టాలి లేదా జిమ్కి  వెళ్ళాలి అనుకుంటాం. కాని, వెధవ   జీవితం తెల్లారే లేవడం అంటే యమ సిరాకు. వెంటనే మనకు మనమే నచ్చ చెప్పెసుకున్తున్నాం . రేపట్నుంచి వెళ్దాం లే అని. అలా వాయిదాతోనే రోజు మొదలు. ఇక ఆ వాయిదా  వేయిస్తుంది మన చేత చిందులే చిందులు. ఒక్క ఒక్క ముక్కలో చెప్పాలంటే తీన్ మార్ ఆడేస్తోంది.  ఒకప్పుడు వందల్లో జీతాలు..... ప్రశాంత జీవితాలు. మరి ఇప్పుడో వేళల్లో జీతాలు కనుమరుగౌతోన్న ఆనందాలు. కారనాలు అంటే ... అవేనండి వాయిదా బతుకులు....! అర్థం కావడం లేదా... వాయిదా పద్ధతుల్లో గుండు సూది నుంచి, విలాసవంతమైన విల్లాల వరకు అన్నింటిని ఎవైన గాని యిట్టె అమర్చుకుటున్నాం. పేరుకే వేళల్లో జీతాలు. ఒకటో తారీకున అలా జీతం డబ్బులు పడటమే లేటు మనకు తెలీకుండానే మన వాయిదా బిల్లుల లొల్లి మొదలు. మనం వేసుకున్నట్లు పాపం ఆ బిల్లులు మాత్రం వాయిదా వేసుకోవు కదా.... వాటి పని అవి టంచనుగా చేస్తాయి. రిజల్ట్ చాలా వయలెంట్గా  వుంటుంది. అకౌంట్లో డబ్బులు అటు నుంచి అటే గోల్మాల్. అక్కడితో ఆరంభం అవుతుంది అసలు కథ. చీటికీ మాటికీ వస్తుంది చిరాకు... ఆపై వుంటుంది అసలు పరాకు. మనిషేమో పనిలో మనసేమో వేరే లోకంలో. అయినవాల్లపై చిందులు... ఆత్మీయులపై అరుపులు... మొత్తం జీవితంలో లేకుండా పోతోంది ఆనందపు ఆనవాళ్ళు. 
             ఉద్యోగులకు ఆఫీసుకు వెళ్ళగానే బాస్ చెబుతానన్న కొత్త వర్క్ లిఫ్ట్ లోనో, లేదా బాస్ చాంబర్ చూడగానో గుర్తొస్తుంది. పాపం ముందు రోజు రాత్రి జోష్ మూడ్ లో మరచిపోతాం. పోనీ గుర్తున్నా ఆఫీసులోను, ఇంట్లోను పనేనా మనిశన్నాక  కాస్త కళా పోషణ ఉండొద్దా అని  మనకు మనమే చెప్పే సుకుంటాం. వాయిదా కే  ఓటేస్తాం. 
            వాయిదా బతుకు సామన్యుడికేకాదు సాక్షాత్తూ ప్రభుత్వాలకూ తప్పడం లేదు. వాయిదా వేయకుంటే బతుకుబండిని లాగలేం అని కాస్త గట్టిగానే  ఫీల్ అవుతున్నాయి.  ప్రజలకు ఇస్తామని కాస్త గట్టిగానే చెప్పిన హామీలని నేరవేర్చడంలోనూ, వాళ్లకు వాళ్ళుగా ప్రకటించిన పేకేజిల  అమలుల్లోనూ వాయిదా మార్గాన్నే ఎంచుకుంటున్నారు. వాయిదాల పున్నెమా అని సామాన్య ప్రజలకే కాదు, రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వాలకు తప్పడం లేదు తిప్పలు. వాయిదానా మజాకా....!