Monday, February 21, 2011

కసబ్ కి ఉరి శిక్షే కరెక్ట్.....


          ముంబై మారణ కాండకు కారణం అయిన కరడుగట్టిన కసబ్ కు ముంబై హై కోర్ట్ విధించిన మరణ శిక్ష యావత్ భారతావని ముక్త కంట్టం తో సరైనదే అని చెప్పే క్షణం. న్యాయ వ్యవస్థ పై నమ్మకాన్ని పెంచే అద్భుత తీర్పు. ఇప్పటికే  ఈ విషయంలో చాలా ఆలస్యం చేశాం. దేశ ప్రతిష్టను, సమగ్రతను, శాంతి భద్రతలను చిన్నా భిన్నం చేసిన ఓ కసాయికి సరైన శిక్షనే ముంబై కోర్ట్ విధించింది. ప్రతి భారతీయుడి ఆశ, ఆకాంక్ష ఇదే. భారతీయుల మనో భావాలను దారుణంగా దెబ్బతీసే దారుణ ప్రయత్నానికి ఒడిగట్టిన ఓ పాకి స్తాని తీవ్ర వాదిని ఇన్ని రోజులు పెంచి పోషించడమే మన దౌర్భాగ్యం. 
                        అభం శుభం తెలియని చిన్నారుల్ని... మన దేశంపై ప్రేమతో వచ్చిన విదేశీయుల్ని... మన ఆర్ధిక రాజధాన్ని నామ రూపాలు లేకుండా చేసిన ఓ కసాయికి పడాల్సిన శిక్ష ఎలా వుండాలి. సాక్ష్యాలు కళ్ళముందే వున్నాయి. యావత్ భారతావని దారుణ సిక్షనే కోరుకుంటుంది. ఇప్పటికే చాలా కోల్పోయాం. చాలు. ఇంకా పోగొట్టుకునేందుకు సిద్ధంగా లేం.
                       నేరానికి తగిన శిక్ష. మన దేశం పై ఎవడైనా వేలేతి చూపితే ఫలితం  ఎంత దారుణంగా ఉంటుందో చూపించే శిక్ష. అసాధారణ శిక్షలలో మన తీర్పు ఇలానే వుండాలి.  తను చేసిన తప్పుకు ఇప్పటికీ పచ్చాతాపం పడని కసబ్ ను వెంటనే ఉరి తియ్యాలి. అయితే మన చట్టాల ప్రకారం... అతను సుప్రీం కోర్ట్ కు వెళ్ళే అవకాసం వుంది. అక్కడ కూడా ఇదే శిక్షను వీలైనంత త్వరగా విధించాలి.ఇది ఓ భారతీయుడిగా నా ఆవేదన..... కొన్ని కోట్ల మంది ఆకాంక్ష...

3 comments:

  1. Every Indian should appreciate and accept high court decision in this regards. Mee aavedanalo ardham vundi. Nice article. :)

    ReplyDelete
  2. నాగరాజు గారూ, పుస్తకంలో మీ కామెంటు చూసి,ఫాలో అయ్యి మీ బ్లాగుకి వచ్చా...అన్ని పోస్టులూ ఒక్కొక్కటే చదివాను...చాలా బాగా రాశారు..ముఖ్యంగా "బడి" టపా....మంచి ఫ్లోలో రాశారు...ః)

    ReplyDelete