తల్లి, తండ్రి, గురువు దైవం ఇదే మనం నేర్చుకున్న మొదటి పాటం. ఈ ఒక్క మాట చాలు మన జీవితంలో విద్యకు, విద్య నేర్చుకున్న బడికి వున్న గొప్పతనం ఏంటో. చిన్నప్పుడు మనం చదువుకున్న బడి ఎంత గొప్పదో కదా...! ఇంగ్లీష్ మీడియం పూర్తిగా రాని రోజుల్లో అంటే సుమారు పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం చదువులు అందించిన బడుల్ని, అప్పటి విద్యార్ధుల్ని తలచుకుంటే మనసు ఆనంద పారవశ్యంలో తేలిఆడుతుంది. విధ్యార్ధులతో కిక్కిరిసిన తరగతి గదులు, గచ్చులు లేని నేల, పూర్తిగా రాయని బ్లాకు బోర్డు అయిన చెప్పే గురువులలో, వినే విద్యార్ధుల్లో ఏదో పవిత్రత. క్రమశిక్షణతో కూడిన విద్య. అమ్మ చెప్పిన బుద్ధులు, బడికి పంపే ముందు ఇచే తాయిలం, చిన్న నిక్కరు, బుజ్జి చొక్కా, సంకలో టైలర్ కుట్టిచ్చిన సంచి, ఉచిత పాఠ్య పుస్తకాలు, బడికి చేరగానే మొదలయ్యే వందన సమర్పణ, ఒక్కొక్కటిగా మొదలయ్యే పాఠాలు, గంటన్నర కాగానే ఇచ్చే, ఇంటర్వెల్, తోట పని, అలిసేవరకు మనసార అడే ఆటలు, ఆహా ఎంత క్రమశిక్షణ కలిగిన విద్య. నిజంగా ఇంతటి అందమైన భాల్యాన్ని గడిపామా అనే ఆనందం కలుగుతుంది. మరో పక్క గర్వంగాను వుంది. పల్లె ఒల్లో ఓ మూల పాతబడిన భవనం లో వుండేది మన బడి. అక్కడి నుంచే అందరి బంగారు భవితకు పునాదులు పడ్డాయి. పూర్తి స్థాయి కార్పొరేట్ వసతులున్న పిల్లలకి దీటుగా పోటీ పడే శక్తిని, ఆత్మ స్థైర్యాన్ని ఇచ్చింది ఆ చిన్న బడే. కొన్ని సార్లు వాళ్ళ కంటే మనమే గొప్ప అనే అనుభూతిని కలిగించిన్దీ ఆ బడే. అంత గొప్పది మనం చదువుకున్న, మనకు విద్యా బుదుల్ని నేర్పించిన మన అందరి అందాల ఒడి మన బడి.కానీ ఇంత చక్కని బడి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. మనం అనుభవించిన ఆనందం, పొందిన అధ్బుతమైన, ఆత్మీయ క్షణాలు మన ముందు తరాలకు దూరమయ్యే సమయం ఎంతో దూరంలో లేకపోలేదు. కారణాలు ఎవైన కావొచ్చు. బిజీ లైఫే ను కాస్త పక్కకు నెట్టి ఓ క్షణం ఆలోచిస్తే గుండెల్ని పిండేసే ఆ నగ్న సత్యం కనిపిస్తుంది. మారుతున్న కాలంతో పాటు మనం మారాలి. మార్పు సహజం. పోటీ ప్రపంచంలో మనల్ని మనం విజేతలుగా నిలబెట్టుకోవాలంటే కొత్తధనాన్ని, సరి కొత్త నైపుణ్యాలను అందిపుచుకోవాలి. కాని, మనల్ని మానవతా మూర్తులుగా, ఓ మంచి పౌరులుగా తీర్చి దిద్ది, మన ఎదుగుదలకు బాటలు వేసిన మన బడిని మనం మరచిపోకూడదు.
విదేశీ అలవాట్లంటే చెవు కోసుకునే మనం, రోజుకో పాచ్యాత సంస్క్రుతిని అద్దెకి తెచ్చుకుని సంబరపడే మనం, వాళ్ళ మంచి అలవాట్లను మాత్రం తీసుకోవడం లేదు. కనీసం వాటి పై ద్రుష్టి పెట్టలేకపోతున్నాం. ఎక్కడో చదివాను, బాగా అభివ్రుది చెందిన దేశాల్లో, జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏదో ఓ సమయంలో ప్రతి ఒక్కరు, వాళ్ళు చిన్నప్పుడు చదివిన స్చూల్స్ ని సందర్సిస్తారట. పుట్టిన రోజో, పెళ్లి రోజో, లేక పోతే పిల్లల పుట్టిన రోజునో వాళ్ళ చిన్ననాటి బడిలో గడుపుతారట. అక్కడున్న చిన్నారులకు చాకలేట్స్, తరగతి గదికి కావాల్సిన వాల్ పోస్టర్స్, వారి వారి స్తోమతకు తగ్గట్టుగా గ్రంధాలయానికి పుస్తకాలను అందిస్తారట. ఇలా ఆ ఆర్టికల్ చదువుతుంటే ఎంతో ఆనందం కలిగింది. మనసు పులకించింది. కాని మంచిని మరచి పోవడం మానవ నైజం. రాసే నేను, చదివే మీరు, మంచిని గురించి మీటింగ్ లు ఇచ్చెవాళ్ళు అంతా మంచికి దూరంగా వుంటారు. అది సహజం.
ఎవరి కోసమో, ఎవరో గుర్తిస్తారని కాదు, మన కోసం, నిత్యం బిజీ లైఫ్ లో ఏదో కోల్పోతున్నాం అనుకుంటూ బాధ పడే మనం ఓ సారి మన బడిని సందర్సిధం. వీలైతే ఈ తరాన్ని మన అందాల ఒడి, మన బడికి తీసుకెళ్దాం. గర్వంగా మన ఎదుగుదల పునాదుల్ని చుపిద్దం. ప్రత్యేకంగా వెళ్ళే అవకాసం లేకపోతే కనీసం కళ్ళు మూసుకుని మన బడిని, బడిలో చేసిన అల్లరిని, బడినుంచి మా బంగారు తండ్రి ఏదో సాధించి వస్తాడు అనేలా ఎదురుచూస్తున్న అమ్మ ఆనందాన్ని ఓ సారి జ్ఞాపకం చేసుకుందాం. బాల్య స్మృతుల్ని ఆస్వాదిదాం. అందమైన అప్పటి అనుభూతుల జ్ఞాపకాల దొంతరల్లో తడిసి ముధవుదాం.
Saturday, January 8, 2011
Friday, January 7, 2011
పాపం హీరోయిన్లు...!
తెలుగు తెరపై తమ అందచందాలతో యువకుల గుండెల్లో గుభులు రేపుతూ, నిర్మాతలకు కాసులు కురిపించడంలో కీలక పాత్ర పోషించే వాళ్ళే కధనాయికలు. అప్సరసలకు ఇంచుమించు అటు ఇటుగా వుంటారేమో అనేలా వుండే సొగసుతో సినిమా అభిమానులతో పాటు కాస్త కళా పోషణ వున్నవాళ్ళకు నిద్రల్లేని రాత్రులని చూపించడంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు. అందుకే తరాలు మారిన వెండి తెరపై వీళ్ళు చేసే, చూపించే అభినయాలకు, అంగాంగ ప్రదర్శనకు అభిమానులు జేజేలు పలుకుతుంటారు. గతం ఎప్పుడూ గొప్పదే అన్న నానుడికి తగ్గట్టుగా పాత సినిమా హీరోఇన్స్ చక్కటి నటనతో, మంచి కట్టూ, బొట్టు తో అందరి అభిమానుల గుండెల్లో ఆరాధ్య వ్యక్తులుగా నిలిచిపోయారు. కాని ఇప్పుడు సీన్ మారింది తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు లేరు కాదు రావడానికి ఇష్ట పడడం లేదు. ఒక వేల వచ్చినా మన చవకబారు పాత్రల్లో ఇమడలేక, రక రకాల కారణాలతో తెలుగు తెరపై తెలుగు వచ్చిన, తెలుగు తెలిసిన అమ్మాయిల జాడ లేకుండా పోయింది.
అప్పుడే మొదలయింది అసలు కథ, చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపల వేట. ముంబై, గోవా, విదేశీ వనితలు ఒకటేమిటి రకరకాల రింగా రింగా భామలు తెలుగు తెరపై తెగ ఆడేస్తున్నారు, పాడేస్తున్నారు. వీళ్ళకి గిరాకి కూడా విపరీతంగా పెరిగడంతో ఒక్కసారిగా ఎర్ర తోలు భామలంతా కొండెక్కి కూర్చుంటున్నారు. ఇందుస్త్రీకి వచ్చిన కొన్నాళ్ళకే పిలిచే పిలుపులలో, అందుకునే వసతుల్లో అమ్మగారిగా మారిపోతున్నారు. వాళ్ళ ఊళ్లలో ఆటోల్లో తిరిగే వాళ్ళంతా ఇక్కడ స్కోడా కార్స్, ఫైవ్ స్టార్ వసతుల్ని డిమాండ్ చేస్తున్నారు, అలానే సకల సుఖాలు పొందుతున్నారు. అనుభ విస్తున్నారు. వాళ్ళ నటన దేవుడెరుగు నిర్మాతలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. పేరు, డబ్బులు వాళ్లకి కర్చులు, అప్పులు మాకా అనే భావన ఇప్పుడు ప్రస్తుత నిర్మాతల్లో పెరిగింది. ఇప్పుడు హీరోయిన్ల కు ఇచ్చె వసతుల్ని కట్ చేసేందుకు నిర్మాతలు రెడీ అయ్యారు.
రాజ భోగాలు అనుభవిస్తోన్న రంగుల రాణులకు ఇకపై వసతుల్లో కట్ పడనుంది. మేక్ అప్ మెన్, అసిస్టెంట్ ఇలా అన్నింటి కర్చు హీరోయిన్ లే పెట్టుకోవలన్నమాట. సో, ఇప్పటి వరకు జిల్ జిల్ జిగాగా గడిపిన ముదుగుమ్మలకు గడ్డు రోజులు దగ్గర పద్దయన్నమాటే....! పాపం ఎంత కష్టం వచ్చిందో ఈ అభినవ సుందరాంగిలకి.

Thursday, January 6, 2011
సినిమా వాళ్ళ రంగుల కల...!
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. చాలా మంది సినిమాలలో సెటిల్ అవుదామని, హీరోనో, హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుధామని అందమైన కలలెన్నో కంటారు. అందుకోసం పగలనక రేయనక తెగ ప్రయాస పడతారు. అది సహజం. ఇప్పుడు సీన్ మారింది. ఇండస్ట్ర్రీ లో ఫుల్ గా సెటిల్ అయ్యి ఓ వెలుగు వెలుగుతున్న వాళ్ళందరూ గత నెలరోజులుగా అందమైన కలలెన్నో కంటున్నారు. తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇందుకోసం మీటింగ్ ల మీద మీటింగులతో బిజీ బిజీ గా గడిపేస్తున్నారు. ఒకప్పుడు అప్పటి అగ్ర హీరోలు ఎన్టిఆర్, ఏఎన్నార్, శోభన్బాబు వంటి నటులు ఆన్ స్క్రీన్ మీదే కాదు నిజ జీవితంలోను క్రమశిక్షణతో హీరోలుగా సెటిల్ అయ్యారు. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేకున్నా, ఇప్పటి సదుపాయాల్లో సగం కూడా లేని రోజుల్లో అధ్బుతాలు సృష్టించారు. వ్యక్తి గతంగా ఎలా వున్నా, పనిలో మాత్రం పక్కా ప్రోఫెషనలిజం చూపించారు. పొద్దున్నే ఏడు గంటలకు షూటింగ్ అంటే పది నిముషాల ముందే స్పాట్లో వుండేవారట. ఇప్పుడు మన హీరోలకు వసతులు , హీరోయిన్ లతో సొల్లు ఫై వుండే శ్రద పని మీద వుండడం లేదు. లేటుగా సెట్స్ కి రావడం, త్వరగా వెళ్ళిపోవడం, కబుర్లతో నిర్మాతలకు చుక్కలు చూపించడంలో ఎవరు ముందుంటారో వాల్లే బిగ్ స్టార్స్. ఇది ఇప్పటి హీరోల పరిస్థితి. ఇక హీరోయిన్ లు, అబ్బో అబ్బో వీళ్ళ గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి, తెలుగు రాదూ, నటన అంటేనే తెలీదు, ఇక హావ భావాల వుసేన్దుకులెండి . జస్ట్ వీళ్ళంతా వొంపు సొంపులతో సొమ్ము చేసుకోవాలని చూసే కలల కిలాడీలు. చిన్న దుస్తుల్లో తెల్ల తోలు తో తమాషా చేసే నెరజానాలు. ఒకప్పటి నిర్మాతలు వాళ్ళు తియ్యలనుకునే సినిమా కథ ఎక్కడ తియ్యాలి, ఎలా తియ్యాలి ఎన్ని రోజుల్లో సినిమా పూర్తి చెయ్యాలి అనే కీలక అంశాలపై స్పష్టత వుండేది. ఇప్పటి నిర్మాతలు అయ్యో పాపం వీటిపై కనీసం అవగాహనా కాదు ఆసక్తి చూపించడం లేదు. అందుకే సినిమాల పరిస్థితి ఇంత దారుణంగా వుంది.
ఇలాంటి పరిస్తితుల్లో సినిమా పరిశ్రమలో సమూల మార్పులకు పూనుకుంటున్నారు. నిర్మాతలే బాస్ అవ్వాలి, హీరోలు సెట్స్ కి టైం కి రావాలి, తెలుగు హీరోఇన్స్ పెరగాలి, కర్చులు తగ్గాలి, విజయవంతమైన సినిమాల సంఖ్యా పెంచాలి ఇలా ఎన్నో ఎన్నో అన్ని ఒకేసారి మారాలి అనే అధ్బుతమైన కలలు ఎన్నింటినో ఒకే సరి కంటున్నారు. ఈ కలలన్ని నెరవేరుతాయో, లేక కల్లలు గానే మిగుల్తాయో తెలీదు కానీ. తప్పులు తెలుసుకున్నారు అదే పది వేలు అంటున్నారు సీనియర్ నటులు. ఎవరి గోల వాళ్ళది.
ఏదేమైనా, పరిశ్రమ ఏదైనా, శ్రమించే గుణాన్ని నమ్ముకుని భాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తేనే హక్కుల కోసం పోరాడే పరిస్తితి ఉంటుందని ఎప్పటికి తెలుస్తుందో ఈ సినిమా మానవులకి. సినిమాని అభిమానించే వ్యక్తిగా, సినిమా పరిశ్రమను దగ్గరగా చూసే అవకాశం కలగినందుకు, సినిమా వాళ్ళ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కాని కలలు నెరవేరాలంటే కళలో కళాత్మకత వుండాలికదా....!
Tuesday, January 4, 2011
పల్లెకు పోదాం హాయిగా....!
అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు,
సరదాల సంక్రాంతి సంబరంగా సందడి చేస్తూ వచ్చేస్తోంది. పల్లెల్లో పండగ సందడి ఆరంబం అయ్యింది. కొత్త బట్టల కోసం పిల్లలు చేసే అల్లరి, కొత్త అల్లుళ్ళ కోసం అతరింట్లో రెడీ అవుతోన్న రాచ మర్యాదలు హంగామా అంత ఇంత కాదు. అమ్మమ్మ, తాతయ్య, నాయినమ్మ, అత్తలు , మామలు, గతంలో మనం చేసిన పండగ సరదాలు మన కాళ్ళ ముందుకు అలా అలా ఓ అందమైన అలలా కదలాడుతున్నాయి. పల్లెల్లో మన వాళ్ళు మనకోసం ఆశగా చూసే ఆత్మీయ చూపులు మన గుండెలకు తాకుతున్నాయి. తెలుగు లోగిళ్ళలో పరికిణి కట్టిన పడుచులు వేసే అందమైన రంగవల్లులు, హరిదాసు హంగామా, కోడి పందేల కోసం చాటు మాటుగా సాగుతోన్న ఏర్పాట్లు, పేకాట రాయుళ్ళ ప్రిపరేషన్ ఇలా ఒకటా రెండా ఎన్నో మరెన్నో అంబరాన్నంటే సంక్రాంతి సంబరాల హంగామా అందరికి ఎర్ర తివాచితో స్వాగతం పలుకుతున్నాయి. బిజీ బిజీగా వుండే అందరికి ఆత్మీయ ఆనందాల రుచుల్ని మరో సరి రుచి చూపించేందుకు పల్లె పిలుస్తోంది. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో, బస్సు టికెట్ వుందో లేదో, ట్రైన్కి ఎలా వెళ్తాం అని మనసులో ఆరాటం పెరుగుతోంది కదా... తప్పదు ఎందుకంటే ఏడాది పటు హాయిగా పనిచెయ్యాలంటే ఆత్మీయతతో మన వాళ్ళు నింపే ఆక్షిజెన్ ను మనసారా నింపుకు రావాల్సిందే. ఇంకేదు ఆలస్యం పల్లెకు పోదాం హాయిగా... పండగ చేద్దాం మనసార... అందరికి మరో సరి సంక్రాంతి శుభాకాంక్షలు...

Subscribe to:
Posts (Atom)